నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి):
కోరుట్ల పట్టణం లోని నవ జ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ఆదివారం రోజున మాస్టర్ తైక్వాండో క్లబ్ కోరుట్ల తరపున తైక్వాండో కలర్ బెల్ట్ అప్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ట్రెజరర్ మాస్టర్ జి సంతోష్ మరియు కరీంనగర్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మాస్టర్ ఎస్ సంతోష్ ల ఆధ్వర్యంలో దాదాపు 75 మంది తైక్వాండో ప్లేయర్స్ కి బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించి, వారి వారి అర్హతను బట్టి బెల్టులు మరియు సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వక్త, మోటివేషన్ స్పీకర్ విజేత స్టూడెంట్స్ కౌన్సిలింగ్ సెంటర్ అధినేత శ్రీ పుప్పాల నవీన్, మాస్టర్ తైక్వాండో క్లబ్ మెట్పల్లి ప్రెసిడెంట్ శ్రీ ఎలుగందుల అజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రముఖ మోటివేషన్ స్పీకర్ పుప్పాల నవీన్ మాట్లాడుతూ తైక్వాండో ప్లేయర్స్ కి జీవితంలో తైక్వాండో ఎలా ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో తైక్వాండో శిక్షణ మరియు సర్టిఫికెట్ల ద్వారా ఉన్నత శిఖరాలను ఎలా అదిరోహించాలో ఈ సందర్భంగా మోటివేషన్ స్పీచ్‌ని ప్లేయర్స్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ కోలా గంగారావు మాస్టర్ , కరీంనగర్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పెండ్లి రాజేందర్ మాస్టర్ ఎగ్జామినర్స్ గా వ్యవహరించారని మాస్టర్ తైక్వాండో క్లబ్ వ్యవస్థాపకులు, తైక్వాండో నేషనల్ రెఫరీ, తైక్వాండో నేషనల్ కోచ్, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్ అయిన నావనంది రమేష్ మాస్టర్ తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మాస్టర్స్ గజం దీక్షిత, రోహిత్, జశ్వంత్, నవ జ్యోతి హై స్కూల్ కరస్పాండెంట్ సుజాత, అధ్యాపక బృందం , టీచర్ పావని లు పాల్గొన్నారు.




