నేటి సాక్షి, జమ్మికుంట : ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా జమ్మికుంట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని టైలర్ వృత్తి చేస్తూ జీవిస్తున్న శంకర్ శ్రీనివాసు లను సత్కరించారు. వాసవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అయితు రమేష్, గుడివాడ వెంకట సతీష్ ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారిని సన్మానించి చిరు కానుకతో సత్కరించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టైలర్ ల పరిస్థితి దారుణంగా ఉందని రెడీమేడ్ వస్త్రాలకు ప్రజలు అలవాటు పడడంతో దర్జీలకు పనులు లేక ఆందోళనకరంగా వారి జీవితాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. వీలైనంతవరకు దర్జీలకు ఉపాధి కల్పించే విధంగా వాసవి క్లబ్ సభ్యులు వారికి అండగా నిలబడాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రేణికుంట రాజు జిల్లా బాధ్యువాసవి క్లబ్ ఆధ్వర్యంలో టైలర్ లకు సన్మానం.




