Saturday, March 21, 2026

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకోండి

  • బిజెపి మండల ఉపాధ్యక్షుడు కిషన్ నాయక్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పెద్దమందడి మండల బిజెపి ఉపాధ్యక్షులు కిషన్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగులు తప్ప, కూలీలతోపాటు అందరూ లేబర్ ఇన్సూరెన్స్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే అని వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలోకి చాలామంది కార్మికులు మాత్రమే చేరవచ్చు అని అనుకుంటారు కానీ అది కానే కాదు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులు అని వారన్నారు. లేబర్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ఏడాదికి 22 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని, అలాగే ఐదు సంవత్సరాలకు గాను ఒకేసారి కేవలం 110 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వారు తెలిపారు. లేబర్ ఇన్సూరెన్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి.తెలియని వారికి తెలిపే విధంగా అందరూ సహకరించాలి. లేబర్ ఇన్సూరెన్స్ కు దరఖాస్తు చేసుకోవడానికి 18 సంవత్సరాల నుండి 55 స్త్రీ పురుషులకు వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప ఎలాంటి కూలీలైన ఇతరులైన లేబర్ ఇన్సూరెన్స్ కు అర్హులవుతారు. రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ జత చేసి మీ ప్రాంతంలోని బ్యాంకులో చలానా రసీదు లను జత చేసి లేబర్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో అందజేయాలని వారు తెలిపారు. ఈ లేబర్ ఇన్సూరెన్స్ కు దరఖాస్తు చేసిన పాలసీదారు సహజ మరణం పొందితే 1,30,000/- వేల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని వారు తెలిపారు. అలాగే ప్రమాదవశాత్తు మరణిస్తే 600,000/- లక్షల రూపాయలు అలాగే మరణించిన వారి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరికి వివాహన జరనగా 30,000/- రూపాయలు లేబర్ ఇన్సూరెన్స్ సంస్థ అందజేస్తుందని వారన్నారు. ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-వేల రూపాయల చొప్పున వచ్చే అవకాశం ఉంటుందని వారు అన్నారు. ఒక సంవత్సరం పాలసీ పొందిన తర్వాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి 50 శాతం వికలాంగులుగా వుంటే 2,50,000/- వేల రూపాయలు అదే 100% వికలాంగుడిగా ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంటుందని వారన్నారు. ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒక్కసారి 110 రూపాయలు చెల్లిస్తే ఐదు సంవత్సరాల వరకు చెల్లించిన అక్కర్లేదు. అంటే మీరు సంవత్సరానికి 22 అన్నమాట వెంటనే మీరు మీ కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు అందర్నీ చేర్పించాలని వారు కోరారు. ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారి లేబర్ అధికారి ఎంపీడీవో/ ఎమ్మార్వో లను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని వారు సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News