నేటి సాక్షి, మందమర్రి:- జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం భూ తగాదాలపై మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఆర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టణ తహశీల్దార్ సతీష్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం భూ వివాదాలకు సంబంధించిన దరఖాస్తులను అర్జిదారుల నుండి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించేందుకు మండలం లోనీ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్, ఎస్హెచ్ఓ లు ప్రతి సోమవారం భూ వివాదాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించి, వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం భూ వివాదాల పరిష్కారాలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, మండలంలోని రైతులు, పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.



