నేటి సాక్షి, హుజూరాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు): రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకొని గ్రామాల్ల, మండలాల్లో, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వార్డులలో ఎలాంటి త్రాగు నీటికొరత లేకుండా ఆన్ని చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ గ్రామాల్లో బోర్లు చెడిపోయిన, మైనర్ రిపేర్లు ఉన్నట్లయితే అలాంటి వాటిని గుర్తించి మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని,వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపిన తగ్గట్టుగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పాటించాలని కోరారు.




