నేటిసాక్షి, కరీంనగర్ ప్రతినిధి:
కరీంనగర్ పట్టణంలోని కలెక్టర్ కాంప్లెక్స్ స్థానిక డిటిఓ కార్యాలయంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డైరీ మరియు క్యాలెండర్ డిటిఓ ఉగ్రం నాగరాజు చే టాప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో ఆవిష్కరింపచేయనైనది. ఈ సందర్భంగా టా ప్ర రాష్ట్ర శాఖ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గడ్డం అశోక్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లతోపాటు ఆర్టీసీ మరియు సింగరేణి పెన్షనర్స్ కొరకు పోరాటం చేస్తున్న ఏకైక సంస్థ టా ప్ర అని తెలిపినారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ పి ఎస్ విధానాన్ని అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి తాను మేనిఫెస్టోలో పొందుపరచి హామీ ఇచ్చిన విధంగా తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నూతన పిఆర్సి ని జూలై 2023 నుండి అమలు చేస్తూ పెండింగ్ లో ఉన్న నాలుగు డి ఏ లను వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ మరియు సింగరేణి కార్మికులకు కనీస పెన్షన్ రూపాయలు 15000 చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంలో వారు డిమాండ్ చేసినారు. కార్యక్రమంలో టా ప్ర కరీంనగర్ జిల్లా శాఖ ట్రెజరరీ ఇటువంటి తిరుమలయ్య, కోహెడ చంద్రమౌళి, సొల్లేటి రమణా రెడ్డి, దామెర మల్లయ్య తదితరులు పాల్గొన్నారు





