నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న 30 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని టాస్క్ పోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఎస్సై లచ్చన్న లు మాట్లాడుతూ, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపీఎస్, ఐజి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది జిల్లాలోని తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోయపల్లి బోర్డు వద్ద బెల్లంపల్లి నుండి తాండూర్ వైపుగా వెళ్తున్న ఆటో (టిఎస్ 15 యుఇ 2353) తో పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకొని, ఆటోల తరలిస్తున్న 30 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. మరో నిందితుడు తాండూర్ తంగళ్ళపల్లి చెందిన గోవిందుల శ్రీనివాస్ పరారీలో ఉన్నారన్నారు. ఈ మేరకు నిందితులు తాండూర్, తంగెళ్ళపల్లికి చెందిన దుర్గం శ్రీకాంత్, బుల్లి చందు, కనుగుల తిరుపతి లపై కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని, నిందితులను తదుపరి విచారణ నిమిత్తం తాండూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు.




