నేటి సాక్షి, మందమర్రి:- అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికేఎస్) ఎల్లప్పుడు కార్మికులకు అండగా ఉంటూ, వారి సమస్యలు పరిష్కరించడానికి హక్కుల సాధనకు కృషి చేస్తుందని యూనియన్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ తెలిపారు. పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో సోమవారం యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టి, సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





