- మెదక్ పట్టణంలో గిరిజన మినీ గురుకులాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు
- నాణ్యమైన మెనూ అందించాలి
- మెదక్ పట్టణంలో గిరిజన మినీ గురుకులాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు
- మెదక్ పట్టణంలో గిరిజన మినీ గురుకులం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

నేటి సాక్షి మెదక్ జిల్లా మెదక్ (భూమయ్య) : ఈ సందర్భంగా కలెక్టర్ మినీ గురుకులాన్ని సందర్శించి, వాటిల్లోని పరిశుభ్రతా చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యార్థుల శ్రేయస్సు, బోధనా సామర్థ్యాలు, ఆహార భద్రత, తదితరాల వంటి వాటిని పరిశీలించి, మెనూ ప్రకారం ఆహారం అందించాలని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి ని ఉపాధ్యాయులు వ్యక్తిగత బాధ్యత తీసుకొని మార్గ నిర్దేశనం చేయాలి. తరగతి గదులలో విద్యార్థులతో మమేకమై వారి విద్యా ప్రతిభను పరీక్షించి, పలు సూచనలు చేశారు.విద్యార్థులు ఆరోగ్యముపట్ల మానసికంగా దృడంగా ఉన్నప్పుడు విద్య పట్ల ఆసక్తి చూపుతారని ఆ దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సంబంధిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.





