Saturday, March 21, 2026

ఉపాధ్యాయులు సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలి

  • జిల్లా విద్యశాఖ అధికారి మల్లారెడ్డి

నేటిసాక్షి/వాజేడు : ఉపాధ్యాయులు సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలని ములుగు జిల్లా విద్యాశాఖ ఏ ఎం ఓ మల్లారెడ్డి అన్నారు. వాజేడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఇంటర్ ఆక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ట్రైనింగ్ లో పాల్గొన్న మల్లారెడ్డి ఐదు మండలాల (వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, ఏటూరు నాగారం,మంగపేట) ఉపాధ్యాయులకు పలు సూచనలు అందజేశారు. రానున్న కాలమంతా ఇంటర్నెట్ అనుసంధానంగా జరుగుతుందని దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు శాస్త్ర సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.శిక్షణ కేంద్రంలో ఇచ్చే సూచనలు పాఠశాలలో పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు.అదేవిదంగా విద్యార్థులకు కూడా పాఠాలు చక్కగా అర్థమవుతాయని ఉపాధ్యాయులకు పనిభారం తగ్గుతుందని కాబట్టి ఉపాధ్యాయులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈయొక్క కార్యక్రమంలో వాజేడు ఏం ఈ ఓ తేజవత్ వెంకటేశ్వరరావు హిందీ రిసోర్స్ పర్సన్ లు పొరిక స్వరూప్ సింగ్ జాకీర్ అలీ లకావత్ బాలాజీ ఐదు మండలాలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News