నేటిసాక్షి, రాయికల్ : విద్యార్థులలో తెలుగు భాషాభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకోవాలని తాట్లవాయి పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులు బోగ రమేష్ సూచించారు. మంగళవారం రాయికల్, మేడిపల్లి, భీమారం మండలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన తెలుగు ఉపాధ్యాయులకు ఐ.యఫ్. పి ఇంటర్యాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ వినియోగం పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు బోధన లో ప్రణాళిక ప్రకారం సాంకేతిక పరికరాలను ఉపయోగించి భాషా విజ్ఞానం విద్యార్థులకు అందజేయాలని కోరారు. తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా పదవతరగతి పరీక్షలకు సిద్ధం మయ్యే విద్యార్థులకు ఇచ్చిన సలహాలు, సూచనలను వినిపించారు. మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు, మండల ఆర్ పి లు చెరుకు మహేశ్వర శర్మ, సిద్దె గంగరాజం, యం.నారాయణ గౌడ్, యస్. లక్ష్మి. సి ఆర్.పి తెలుగు భాష ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





