Saturday, March 28, 2026

అక్కడ తీన్మార్ మల్లన్న.. ఇక్కడ బుర్ర మల్లన్న ఇద్దరు సస్పెండ్

నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్) : కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న ను సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇదేలే ఉంటే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బుర్ర మల్లయ్య గౌడ్ ఇటీవల ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మండలం లో చిన్న పదవి అడిగినందుకు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ అయినను కూడా ఇటీవల సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీలో ఉండి నిజాన్ని మాట్లాడినందుకు సస్పెండ్ చేస్తారా అంటూ గుర్తు పెట్టుకుంటామని బుర్ర మల్లయ్య గౌడ్ అన్నారు. పార్టీ కోసం కష్ట పడ్డ వారిని గుర్తించకపోవడం పదవులు రాని మాకు పార్టీ లో ఉంటే ఎంత లేకపోతే ఎంత అని అన్నారు. ఏది నిజం ఏది అబద్దం తీన్మార్ మల్లన్న ప్రజల కోసం పాటుపడే వ్యక్తిని ఎవరికి లొంగకుండా బిఆర్ఎస్ హయంలో కెసిఆర్ కి భయపడని తీన్మార్ మల్లన్న, సీఎం రేవంత్ రెడ్డి కి భయపడడు. ఏ పార్టీ అధికారంలో ఉన్న నిజ నిజాలు మాట్లాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం సరైనది కాదని బుర్ర మల్లయ్య గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తీన్మార్ మల్లన్న ను కలుస్తున్నట్టు బుర్ర మల్లయ్య గౌడ్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News