– ఐఎఫ్ టి యు జిల్లా కోశాధికారి జమ్మిచెడు కార్తీక్ ఆధ్వర్యంలో–
- గ్రామపంచాయతీ కార్మికులపై కక్ష సాధింపులు చర్యలు ఉండకూడదు రాజకీయ నాయకుల దౌర్జన్యం కార్మికులపై ఆపాలి.
- అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలి.
- గ్రామపంచాయతీ కార్మికుల జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలి.
- ప్రతి నెల 5వ తేదీ లోపు జీతాలు ఇవ్వాలని పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలలి.
నేటి సాక్షి, ప్రతినిధి గద్వాల్ : తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్ టి యు జిల్లా కమిటీ గద్వాల్ జిల్లాలో గ్రామపంచాయతీలో పనిచేసిన వేలాది మంది మల్టీపర్పస్ వర్కర్స్ కు అతి తక్కువ వేతనాలు నెలకు 9500 రూపాయలతో కాలం వెలదీస్తున్నారు ఇట్టి జీవితం అతి తక్కువ అది కూడా ప్రతి నెల అందలేక నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్రమైన కష్టాలకు గురవుతున్నారు జిల్లాలో కొన్ని కొన్ని చిన్న గ్రామ పంచాయతీలు నెలల తరబడి జీతాలు అందని స్థితి ఉంది, అంతేగాక ఎస్టిలో పంపిన చెక్కులు డబ్బులు లేక వర్కర్స్ అకౌంట్లో డబ్బులు జమ అవ్వట్లేదు ప్రభుత్వ ఉద్యోగుల ప్రతినెల 1వ తేదీ లోపు జీతాలు చెల్లిస్తున్నారు కానీ గ్రామపంచాయతీ వర్కర్ సిబ్బందికి ఎందుకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు గ్రామపంచాయతీ సకాలంలో జీవితాలు అందకపోవడంతో గ్రామాలలో ఎలా శుభ్రపరచాలని కార్మికులు వాపోయారు. పెండింగ్లో ఉన్నాయి వేతనాలు చట్టం 1936 ప్రకారం ప్రతినెల 5వ తేదీ లోపు లేదా పదో తేదీలోపు జీతాలు ఇవ్వనిచ్చే నేరం ఆలస్యం చేయబడిన జీతాలకు 10 రేట్లు అదనంగా చెల్లించాలి చట్టం పేర్కొంటుంది చుట్టాలను కాపాడాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఉల్లంఘిస్తే ఎవరికి మొరపెట్టుకోవాలి కొన్ని చిన్న గ్రామపంచాయతీలో చెక్కులు ఎస్టీలకు పంపిన కథనంలో డబ్బులు లేక సిబ్బంది అకౌంట్ లో డబ్బులు జమ కావడం లేదు. గ్రామపంచాయతీలో డబ్బులు ఉన్నా అధికారులు ఇతర పనులకు డబ్బులు ఖర్చులు కింద వాడుకుంటున్నారు కావున గ్రామపంచాయతీ కార్మికుల జీతాలను వెంటనే చెల్లించాలి.
గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లు :
ప్రతినెల రెగ్యులర్గా వేతనాలు చెల్లించాలి నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలి. ఏ స్ టి ఓ లో ఇచ్చిన చెక్కులను వెంటనే డబ్బులు జమ చేయాలి.
ప్రతి వర్కర్స్ కు ఇన్సూరెన్స్ ఐదు లక్షల అమలు చేయాలి ప్రమాద బీమా కింద పది లక్షల రూపాయలు ఇవ్వాలి. వయసు మీరిందని సాగుతో కార్మికులను మారిస్తే ఆ కుటుంబంలో ఒకరికి స్థానం కల్పించాలి. రిటర్మెంట్ బెనిఫిట్స్ కు 5 లక్షలు ఇవ్వాలి.
ఏడాదికి మూడు జతలు యూనిఫామ్ లు చెప్పులు సభ్యులు నూనెలు ఇవ్వాలి లేదా వాటికి సరిపడే డబ్బులు అలవెన్స్ రూపంలో ఇవ్వాలి. కార్మికులను అక్రమంగా తొలగింపులు అధికారులు వేధింపులు ఆపాలి.
కార్యక్రమములో పిడి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు హాలింపాష గంజిపేట కోళ్ల అంజి గ్రామపంచాయతీ వర్కర్లు కొండాపురం నరసింహ, తిమ్మప్ప, దేవన్న, బుడ్డన్న, గోవిందు, రాముడు, తిమన్న, వీరన్న, ఉండవెళ్లి లి పరుశరామ్, కుర్మన్న తదితరులు పాలుగోన్నారు





