Thursday, March 26, 2026

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్ట్ కార్మికుల వేతనం పెంచాలి

నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం 26000/- రూపాయలు నిర్ణయించి, అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 2025 మార్చి 1 -7 వరకు రాష్ట్రంలో జరుగుతున్న క్యాంపెయిన్ లో భాగంగా రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టిపిసి ప్లాంట్ గేట్ 2 ముందు నిర్వహించిన గేటు మీటింగ్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కనీస వేతనాలు ఉమ్మడి రాష్ట్రంలో 2006 నుండి 2012 మధ్య సవరణలు చేశారని, చివరిసారి టిఆర్ఎస్ ప్రభుత్వం 2021 లో కొన్ని జీవోలను సవరించిందని, కానీ అది అమలుకు నోచుకోలేదన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సిన జీవోలు 12 సంవత్సరాల కాలం గడిచిన సవరించలేదని, గత టీఆర్ఎస్ ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా పారిశ్రామిక యజమానులకు లాభాలు పెంచడం కోసం మాత్రమే పనిచేస్తున్నాయని, కార్మికుల వేతనాలు మాత్రం పెంచలేదని, యజమానులకు వేల కోట్ల లాభాలు అర్జించే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాలు పెంచాల్సిన తరుణంలో, జీవోల సవరణ పేరుతో తగ్గించి తన వర్గ నైజాన్ని చాటుకుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన చెప్పు చేతుల్లో ఉండే ఐఎన్టియుసి నాయకులు జనక్ ప్రసాద్ చైర్మెన్ గా కనీస వేతనాల సలహా మండలి బోర్డు ఏర్పాటు చేశారని,
కనీస వేతనాల సలహామండల్లో పోరాడే సిఐటియు కు ప్రాతినిధ్యం కల్పించకుండా, కేవలం కాంగ్రెస్ మాత్రమే అవకాశం కల్పించారని, మిగతా కార్మిక సంఘాలకు ఎవరికి ప్రాతినిథ్యం కల్పించలేదని, రాబోయే ఎప్రిల్ లోగా కనీస వేతనం 26,000/-అమలు అయ్యే విధంగా జనప్రసాద్ చైర్మన్ గా ఉన్న కనీస వేతన సలహా మండలి నిర్ణయం తీసుకొని ప్రకటించాలని, లేనియెడల కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
అలాగే ఇప్పటికైనా కనీస వేతనాల సలహామండలిలో మిగతా సంఘాలకు ప్రాతినిథ్యం కల్పించాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని, డిమాండ్ చేస్తూ 2025 మార్చి 6 న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా చేసి వినతి పత్రాలు ఇవ్వాలని, అలాగే మార్చి 7న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున జరిగే ధర్నాకు రాష్ట్రంలోని కాంట్రాక్ట్ కార్మికులు అందరూ హాజరై ధర్నాను విజయవంతం చేసి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి,మన కనీస వేతనాలను సాధించుకునేందుకు కార్మికులందరూ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గేట్ మీటింగ్లో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వి కుమారస్వామి, ఏ ముత్యంరావు, ఎన్ బిక్షపతి,ఎం రామాచారి,RIWU అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గిట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్, నాయకులు దండ రాఘవరెడ్డి, కాదశి మల్లేష్,కే రాజ్ కుమార్, చంద్రమౌళి, ఏ. శంకర్, నారాయణ,కనకయ్య, అజయ్, విజయ్, శంకర్,నారాయణ రెడ్డి , శ్రీనివాస్, రాజయ్య, రవి, నరేష్. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News