Tuesday, March 24, 2026

శ్రీ శక్తి పీఠంసందర్శించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు వద్ద వెలసిన శ్రీ శక్తి పీఠాన్ని గురువారం తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సందర్శించారు. పీఠ ప్రధాన కార్య నిర్వహణాధికారి శశిభూషణ్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికి పీఠ దేవతల విశిష్టత తెలియజేశారు. అనంతరం మంత్రి కుర్తాళ శ్రీ సిద్దేశ్వరీ పీఠాధిపతులు, నడిచే దైవం పరమహంస పరివ్రాజకాచార్యులు, శ్రీ శక్తి పీఠ వ్యవస్థాపకులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీ మహాస్వామి మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ శ్రీ శ్రీ రమ్యానంద భారతీ స్వామినిఆశీస్సులు పొందారు. పీఠ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన రాయలు చెరువు దగ్గర పవిత్రమైన పుణ్యక్షేత్రం త్రిపురసుందరి మరకత మణి అమ్మవారి దర్శనం పూర్వజన్మ సుకృతమన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News