Saturday, March 21, 2026

దేశానికే దిక్సూచి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్

  • ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
  • కేసీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు
  • రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు,కోడె మొక్కులు చెల్లింపు
  • వృక్షార్చన భాగంగా మొక్కలు నాటిన నాయకులు

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ): తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 71వ జన్మదిన వేడుకలను వేములవాడ పట్టణ బిఆర్ఎస్ పార్టీ శాఖలో ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మొదటి బైపాస్ రహదారిలో దాదాపు 100 మొక్కలను నాటి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్నకు అత్యంత ప్రీతికర మొక్కైనా కోడె మొక్కును చెల్లించి కెసిఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకున్నారు. ఆలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు నివాసంలో రక్తదాన శిబిరం నిర్వహించి దాదాపు 15మంది నాయకులు,కార్యకర్తలు,మాజి ప్రజా ప్రజాప్రతినిధులు రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు. ఈ సందర్భంగా బిఆర్ యస్ నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపడంతో పాటు దేశానికి కెసిఆర్ దిక్సూచిగా నిలిచారన్నారు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అని, కెసిఆర్ అంటేనే తెలంగాణ అని అన్నారు. తెలంగాణ ప్రజల కెసిఆర్ పాలనలోనే ఉన్నామనే భావనలో ఉన్నారన్నారు. తెలంగాణ ప్రజల దీవెనలు కేసీఆర్ కు చిరకాలం ఉంటాయన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పది సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్విజయంగా అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. కెసిఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, కలకాలం ఆయురా రోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో సినియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజి కౌన్సిలర్లు నిమ్మశేట్టి విజయ్,సిరిగిరి చందు,మారం కుమార్,గోలి మహేష్,ముద్రకోళ వెంకటేశం,జోగిని శంకర్,నరాల శేఖర్,కోండ కనకయ్య,నీరటి మల్లేశం,పోలాస నరేందర్,వెంగళ శ్రీకాంత్ గౌడ్,చిటి సంధ్యరావు,మంతె సందీప్,సయ్యద్ ఉమర్,రఫిక్,దమ్మ భాస్కర్,రహీమ్,తీగల హరిష్,రాకేష్,శీలం విజయ్,పోతు ఆనీల్,వెంకట్ రెడ్డి,సతీష్ రెడ్డి,గుడిసె సదానందం,అనిల్,సాయి, గగన్,వంశీ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News