- కుటుంబ సభ్యులను పరమర్శిoచ్చిన వొడితల ప్రణవ్
నేటిసాక్షి, కమలాపూర్:
కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన బండి రాజయ్య కుమారుడు బండి వంశీ గత సంవత్సరం ఉన్నత చదువుల కోసం అమెరికాలో ఎమ్మెస్ చదివేందుకువెళ్ళాడు. కాంకోర్డియా సెయింట్పాల్వి విశ్వవిద్యాలయం మాగ్నోలియా ట్రైల్ ఈడెన్ ప్రేరీ, ఆప్ట్ 206, మిన్నెసోటాలొ ఉంటున్నాడు. అమెరికా వెళ్ళిన వంశీ శనివారం రోజున రాత్రి తాను ఉంటున్న అపార్ట్మెంట్ కింద సెల్లార్లో కారులొ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇట్టి విషయం ఆదివారం వారితల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కుటుంబ సభ్యులను పరమర్శిoచారు. ప్రభుత్వపరంగా తొందరగా మృతదేహం రప్పించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని కుటుంబానికి భరోసా కల్పించారు.