శివరాత్రి కి 41 రోజుల ముందుగా శివదీక్షలు….
నేటిసాక్షి, రాయికల్:
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని అల్లిపూర్ గ్రామములో గల శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో(శివాలయం)లో ప్రతి సంవత్సరం … మహా శివరాత్రి సందర్భముగా 41 రోజుల ముందు నుండి శివ దీక్షలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నెల 16 నుండి శివదీక్షలు ప్రారంభమగును. ఈ గ్రామములో గల శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం.. పునః ప్రతిష్ట జరిగిన సం త్సరం నుండి శివ భక్తులు అందరు శివ దీక్షను స్వీకరించి… 41 రోజులు మండల కాలం ఎంతో భక్తి శ్రద్ధలతో శివ దీక్ష స్వాములు శివారాధానలో నిమగ్నమై సకల చర చర జీవారసులకు సృష్టి కర్త అయిన హర హార మహాదేవుని స్మరిస్తూ ఉంటారు. 41 రోజులు ఓం… నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ… నిత్యా భజన కార్యక్రమంలో భగవాన్ నామ స్మరణ శివనామ స్మరణాన్ని జపిస్తూ… ముక్కంటి ఈశుని కరుణ కటాక్షం పొందుటకై… శివ నామ స్మరణ నే ఏకైక మార్గం అని.. భక్తుల ఫ్రాగఢ సంకల్పం. దాదాపు గా గత 22 సంవత్సరం ల నుండి భక్తులు శివ దీక్ష ను స్వీకరిస్తున్నారని శివదీక్ష ప్రారంభ గురు స్వామి వైదిక పురోహితులు అంగడి మఠం భువనేశ్వర్ గురు స్వామి, ఆలయ అర్చకులు గురు లింగు మఠం విక్రమ్ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీక్ష లు అన్నింటిలో ప్రాచీనమైన దీక్ష శివ దీక్ష అని తెలిపారు. ఆనాడు శ్రీరాముడు సైతము శివ దీక్ష స్వీకరించినట్లు ఆధారములు కలవని చెప్పారు ఇట్టి శివదీక్ష తీసుకొన్న స్వాములు అందరికి… ప్రతి సంవత్సరం 41 రోజులు గాను స్వాములందరికి శివదీక్ష అన్న దాన వెల్ఫేర్ సొసైటి ఏర్పరిచి అట్టి సొసైటి ద్వారా ప్రతి నిత్యం స్వాములు అందరికి భిక్ష, ఆల్ఫాభిక్ష ను ఏర్పాటు చేయడం జరిగుతుందని వివరించారు. గత 15 సం.. ల నుండి ఇట్టి కార్యక్రమము కొనసాగుతోందని శివదీక్ష అన్నదాన వెల్ఫేర్ సొసైటి అధ్యక్ష, కార్యదర్శిలు చిట్యాల భూమయ్య, నామని లక్ష్మినర్సయ్య లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ స్వాముల అన్న దాన ట్రస్టు కార్యవర్గం సభ్యులు డాక్టర్ మోర గణేష్, మండ రాజిరెడ్డి, యాదవనేని రాజలింగం, బండారు ముత్తయ్య, నామని శేఖర్, గోడ్డండ్ల శ్రీనివాస్ మరియు హనుమాన్ భజన మండలి సభ్యులు అందరూ ఫాల్గొన్నారు





