నేటి సాక్షి, వేమనపల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష కేంద్రంలో మొత్తం 177 మంది విద్యార్థులకు గాను అందరూ హాజరైనట్లు ఎంఈఓ బొబ్బాల శ్రీధర్ రెడ్డి తెలిపారు.వేసవి నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎస్సై శ్యాం పటేల్ ఆధ్వర్యంలో పోలీసులు పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.విద్యార్థుల కోసం అత్యవసర ప్రాథమిక వైద్య సదుపాయాలు డా. రాజేష్ అందుబాటులో ఉంచారు.





