నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి
( గుండ ప్రశాంత్ గౌడ్ )
గొల్లపల్లి మండల కేంద్రంలోని 11వ వార్డులో విద్యుత్ కొరత కారణంగా వార్డు ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లుారి లక్ష్మణ్ కుమార్ తెలుపగా వెంటనే స్పందించిన ఆయన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో గురువారం రోజున నూతన ట్రాన్స్ఫార్మర్ను ఎస్ ఇ శాలియా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ వార్డు సభ్యులు గురిజాల బుచ్చిరెడ్డి వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేపించిన ప్రభుత్వ విప్పు కృతజ్ఞతలు తెలిపారు.వార్డు ప్రజలతో కలిసి విద్యుత్ ఎస్ ఇ శాలియా, డి ఈ, ఏ డి ఈ వరుణ్ కుమార్ గౌడ్, ఏఈ రాకేష్ కుమార్ ,లైన్ మెన్ గంగారాం మరియు విద్యుత్ సిబ్బందికి శాలువాలతో సత్కరించడం జరిగింది





