- కరీంనగర్ సీపీ వివరణ
నేటి సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో వినాయక విగ్రహానికి కరెంటు తీగలకు తగిలి 9 మంది మరణించారనే వార్త పూర్తిగా అవాస్తవమని కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో అలాంటి విద్యుత్ ప్రమాదం ఏదీ జరగలేదని వివరించారు. వైరల్అవుతున్న పోస్టు 4 నెలల క్రితం కోరుట్లలో జరిగిందని చెప్పారు. దానిని ఇప్పుడు కొంత మంది ఫార్వర్డ్చేస్తూ.. అది కరీంనగర్లో జరిగినట్టు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలను ప్రజలు నమ్మొద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయొద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల్లో నకిలీ వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
https://www.facebook.com/share/v/16mici46wE





