Monday, March 30, 2026

మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

  • అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్టుమెంటల్ అధికారులకు పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికీ అదనపు కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిలో మొత్తం 6,853 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష హాలులోకి సెల్ ఫోన్లను ఎలక్ట్రానిక్ గూడ్స్, గడియారాలు అనుమతించవద్దని తెలిపారు. పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడంలో చీఫ్‌ సూపరింటెండెంట్లదే ప్రధాన బాధ్యత అని విజ్ఞప్తి చేశారు.సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఏసీజీ గణేష్, చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇతర విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News