- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య
నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : మునగాల మండలం రేపాల గ్రామంలో బుధవారం MPO దారా శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య పాల్గొని మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనిలో 20 రోజు పనిచేసిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు సంక్షేమ పథకాలు ఇస్తాననడం సరైనది కాదని దాన్ని ప్రభుత్వం రద్దుచేసి అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని గ్రామసభ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, వ్యవసాయ కూలీలు తదితరులు పాల్గొన్నారు.





