- పురావస్తు పరిశోధకులు డా. ఈమని శివ నాగిరెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా 18 : పెబ్బేరు మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిడ్జి రంగాపూర్ లోని ఓటిగుడిని పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బి.రామచంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు శనివారం నాడు ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనపర్తి సంస్థానానికి చెందిన జనంపల్లి రంగారెడ్డి 400 సంవత్సరాల క్రితం విజయనగర వాస్తు శిల్ప శైలిలో శివాలయాన్ని నిర్మించాడని, ఆలయ గోడలు ద్వారా శిల్పాల పై అనేక పౌరాణిక శిల్పాలు ఆకర్షణియంగా తీర్చిదిద్దబడిఉన్నాయని ఆలయ శిఖరం పై కప్పలభాగం వరకు కూలిపోయిందని, చారిత్రకు ప్రాధాన్యత గల ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలనీ గ్రామస్తులకు శివ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెన్నెల సాహిత్య అకాడమీ అధ్యక్షులు ముచ్చర్ల దినకర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు డాక్టర్ బై రోజు శ్యాంసుందర్ పడే సాయి, కరుణాకర్ రెడ్డి, అద్దంకి రవీంద్ర, గ్రామస్తులు మందడి చిరంజీవి, బాపనపల్లి రమేష్, ఆలేటి జానీ, జల్ల విష్ణు, బాలకృష్ణ, శాంతమ్మ, సాయన్న తదితరులు పాల్గొన్నారు.





