Tuesday, March 24, 2026

సమీకృత గురుకుల 500 పడకల ఆసుపత్రికి మాజీ బీసీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టాలి

  • సమీకృత గురుకులానికి జయరాములు యాదవ్ పేరు
  • 500 పడకల ఆసుపత్రికి డా.బాలకిష్టయ్య ముదిరాజ్ పేరు పెట్టాలి
  • వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి రాచాల యుగంధర్ గౌడ్ వినతి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : సిఎంతో మాట్లాడి మాజీ ఎమ్మెల్యేల పేర్లు పెడతామని ఎమ్మెల్యే స్పష్టమైన హామీ, ఎమ్మెల్యే స్పందనపై బీసీ నాయకుల హర్షం మార్చి 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు 500 పడకల ఆసుపత్రికి దివంగత మాజీ ఎమ్మెల్యేలు మూలమాల్ల జయరాములు యాదవ్ మరియు డాక్టర్ ఎ.బాలకిష్టయ్య ముదిరాజ్ గార్ల పేరు పెట్టాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కి బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో మాట్లాడి వాటికి మాజీ బీసీ ఎమ్మెల్యేల పేర్లు పెడతామని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే మేఘారెడ్డి సానుకూలంగా స్పందించడంతో బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News