- డిమాండ్ చేసిన దళిత సంఘాల నాయకులు
నేటిసాక్షి (కె. గంగాధర్ )పెగడపల్లి : పెగడపల్లి మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో తమిళనాడులోని శివగంగ జిల్లాలో బుల్లెట్ బండి నడిపాడని దళితవర్గానికి చెందిన అయ్యస్వామి అనే డిగ్రీ విద్యార్థిని అదే ప్రభుత్వ కళాశాలకు సంబంధించిన అగ్రవర్ణాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అయ్యస్వామివి రెండు చేతులు నరికివేసిన సంఘటనలో నిందితులను ముగ్గురిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డి.హెచ్.పి.ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగురాల భూమేశ్వర్, ఎమ్మార్పిస్ సీనియర్ నాయకులు దీకొండ మహేందర్, శ్రీరాం అంజయ్య, డి.హెచ్.పి.ఎస్ మండల అధ్యక్షులు బొమ్మేన పురుషోత్తం, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బాలే అంజయ్య, బీసీ నాయకులు బొడ్డు రమేష్, తడగొండ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.





