- హామీల అమలులో చిత్తశుద్ధి చాటుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- ఇందిరమ్మ రాజ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
- ఈ ఆనంద సమయాన గ్రామ గ్రామాన సంబరాలు నిర్వహించుకుందాం
- వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ బిల్లులను చట్టసభలో ఆమో దించడం చారిత్రాత్మక విషయమని, దేశ చరిత్రలోనే ఇలాంటి బిల్లును చట్టబద్ధత చేసింది తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారేనని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.ఎన్నికల ముందు కామారెడ్డి, చేవెళ్లే డిక్లరేషన్లలో ప్రకటించిన హామీలకు కట్టుబడి నేడు బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ బిల్లులను చట్టబద్ధత చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతను చాటుకుందని ఆయన పేర్కొన్నారు.ఇలాంటి చారిత్రాత్మక విష యాలను ఎప్పటికీ జ్ఞాపకం ఉండేలా గ్రామ గ్రామాన సంబరాలు చేసుకొని, ఆనందాన్ని ప్రతి ఇంటికి చేరవేసేలా కార్యక్రమాలను నిర్వహించుకుందాం.ఏఐసీసీ ఆదేశాల మేరకు జై బాబు, జై భీమ్, జై సంహిదాన్ అభియాన్ కార్యక్రమాలను కూడా నిర్వహించు కుందామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ ఆనంద వేళ గ్రామాల్లో బాణాసంచా కాల్చి, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకొని, ఇంటింటికి కరపత్రాలు పంచి, ఊర్లలో పండగ లాగా సంబరాలు నిర్వహించి, స్టేజీలు ఏర్పాటు చేసుకొని, సమావేశాలు నిర్వహించుకుని, ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేసి ఈ బిల్లుల ప్రాముఖ్యతను అందరికీ తెలిసేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని మనస్ఫూర్తిగా సూచిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.





