Monday, March 30, 2026

అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన దుండగులను శిక్షించాలి

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): జగిత్యాల జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన సంఘటనపై దళిత సంఘాల నేతలు భగ్గుమన్నారు. మండలంలోని రాజారంపల్లి ప్రధాన కూడలీలో శనివారం దళిత సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు చుంచు మల్లేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి, సారంగాపూర్ మండలం నగునూర్ గ్రామంలో నెలకొల్పిన డా.బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహంనకు పాదరక్షల దండ వేసి అవమానపరచడం అత్యంత హేయమైన చర్య అని, దీనికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ సందర్బంగా దళిత సంఘం నాయకులు మాట్లడుతూ… ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రజాసౌమ్య దేశం భారతదేశం. దీనికి రాజ్యాంగంను అందించిన మేధావి బాబా సాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భారతదేశంలో అణగారిన కులాల కోసం పాటుపడుతునే, యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఆయా రూపాల్లో అణచివేతకు గురైన దీనుల జీవితాల్లో వెలుగులు నింపాడు కాబట్టి ఆ మహనీయుడిని ప్రపంచమంతా ఆరాదిస్తున్నారన్నారు. కానీ మన దేశం, రాష్ట్రంలో కొందరు సంఘ విద్రోహక శక్తులుగా మారి ఇలాంటి చర్యలకు పాల్పడుతూ.. కుల, మతాలల్లో చిచ్చు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఇది ప్రజాసౌమ్యానికి ప్రమాదమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని ప్రభుత్వం, పోలీసు శాఖ వారు వెంటనే పట్టకుని, ఆ దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునవృత్తం కాకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం సీనియర్ నాయకులు పడిదం వెంకటేష్, గాదం బాస్కర్, రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి లక్ష్మణ్, నాయకులు బోయిని సతీష్, శ్రీనివాస్, యువ నాయకులు మంతెన సంజీవ్, సురేష్, అరికిల్ల మహేంధర్, దుర్గం కృష్ణ, మంతెన రాజు, చొప్పదండి రాములు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News