Thursday, April 2, 2026

జిల్లాలో స్థానిక అవసరాలకు మేరకు ఇసుక వాడుకోవడానికి అందుబాటులో ఉన్న రీచులను వెరిఫై చేసి నివేదిక సమర్పించాలి

  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : బుధవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు తో కలిసి జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక అవసరాలకు మేరకు ఇసుక వాడుకోవడానికి అందుబాటులో ఉన్న రీచులను వెరిఫై చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఖిల్లా ఘన్పూర్ మండల పరిధిలోని కమాలుద్దీన్ పూర్, పెద్దమందడి మండల పరిధిలోని చిలకటోని పల్లి, మదనాపురం మండల పరిధిలోని కరివేన, దుప్పల్లి, ఆత్మకూరు మండల పరిధిలోని వీరరాఘవపురం రీచ్ లను వెరిఫై చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, జిల్లాలో అక్రమంగా ఫిల్టర్ ఇసుక దందా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా జిల్లాలో అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలించడానికి వీలులేదని, ఎవరైనా ఇసుక అవసరం ఉంటే మన ఇసుక వాహనం ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించారు. అక్రమంగా ఇసుక తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సమావేశంలో మైనింగ్ అధికారి గోవిందరాజు, జిల్లా పంచాయతీ అధికారి సురేష్, సి సెక్షన్ సూపర్డెంట్ కిషన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News