Thursday, April 2, 2026

గిరిజనుల సాగు భూముల పట్టాలు సాధించేవరకు బిజెపి పార్టీ పోరాటం ఆగదు

  • గిరిజనులకు ఎన్నికల ముందు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన రాజకీయ పార్టీలు
  • బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డా.కళ్యాణ్ నాయక్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : బుధవారం ఖిల్లా ఘనపూర్ మండలం మామిడివాడ శివారులోని గిరిజన తండా వాసుల భూముల పట్టాల సాధనకై ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షుడు రవి నాయక్ ఆధ్వర్యంలో భూముల పరిశీలనకై వచ్చిన ముఖ్యఅతిథి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డా.కళ్యాణ్ నాయక్ జిల్లా అధ్యక్షులు డి నారాయణ గారితో కలిసి జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డా. కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం మామిడిమాడ శివారు సర్వే నెంబరు 339 లోని 463 ఎకరాల భూమి కొరకై వెనికి తండా, ముందరి తండా, మేడి బావి తండా, కర్నే తండా, ఆముదం బండ తండా, చిన్న పేరు తండా, మిత్యా తండా మరియు భీముని తండా తదితర ఎనిమిది గిరిజన గ్రామాలలో 70 యేళ్ళుగా సాగు చేస్తున్న భూముల పట్టాల కొరకై 150 గిరిజన కుటుంబాలు ఉద్యమం చేయడం చాలా బాధాకరంగా ఉందని ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు హామీలిచ్చి మోసం చేశారని గిరిజనులకు పట్టాలిప్పించే వరకు బిజెపి పార్టీ తోడుగా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 2018 ఎన్నికల్లో గెలిస్తే పట్టాలిప్పిస్తానని హామీ ఇచ్చి గెలిచాక మోసం చేశాడని వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల పేరిట దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేస్తున్న వందలాది ఎకరాలను కొల్లగొట్టిన మాజీ మంత్రి గిరిజనులకు ప్లాట్ల పేరిట మోసం చేసి మహబూబ్నగర్ జిల్లాలో భూమి కోల్పోయిన రైతుకు వనపర్తి జిల్లాలో నష్టపారం పరిహారం ఇప్పించి భూ కుంభకోణానికి పాల్పడ్డాడని ఆ ఆధారాలను త్వరలోనే బయటపెడతామని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మేఘా రెడ్డి గారు గెలిచి 15 నెలలు అయినా కూడా గిరిజనుల సమస్యల పట్ల ఆలోచించే తీరిక లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై గిరిజనులు మోసం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాడని అదే జరిగితే గిరిజనుల చేతిలో మేఘారెడ్డికి తీవ్ర పరాభవం తప్పదని హెచ్చరించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వనపర్తితో ప్రత్యేక సంబంధం ఉందని ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు గిరిజన సమస్యల సాధనకు ప్రయత్నం చేయాలని లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదేశాలతో 463 ఎకరాల భూములు గిరిజనులకు పట్టా సాధించడానికి భారతీయ జనతా పార్టీ ఉద్యమ కార్యాచరణతో ముందుకు రాబోతున్నదని దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవాలని సవాల్ విసిరారు.ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబ్బిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కల రామన్ గౌడ్, ఎస్ టి మోర్చా జిల్లా అధ్యక్షులు రవి నాయక్,బిజెపి జిల్లా అధికార ప్రతినిధి& మీడియా ఇన్చార్జి పెద్దిరాజు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, రాజు నాయక్,తిరుపతి నాయక్,రామకృష్ణ నాయక్,పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్, యువమోర్చా అధ్యక్షులు ఎద్దుల రాజు, ప్రధాన కార్యదర్శి నవీన్ చారి, ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఆగపోగు చాణక్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News