- గన్నేరువరం మండల బిజెపి అధ్యక్షుడు తిప్పర్తి నికేష్
నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రామీణ ప్రాంత ప్రజలకు వరం లాంటిదని గన్నేరువరం మండలం బిజెపి అధ్యక్షులు తిప్పర్తి నికేష్ అన్నారు. ఈ మేరకు 2025 బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భారీగా నిధులను కేటాయించడం సంతోషకరమైన విషయమని, ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా వలసలను నిరోధించడానికి అవకాశాలను కల్పించడమే ఉద్దేశ్యంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ లో భారీగా నిధులను కేటాయించడం సంతోషకర పరిణామం అని తిప్పర్తి నికేష్ అన్నారు. వ్యవసాయం, ఎం ఎస్ ఎం ఈ ఎగుమతులు, పెట్టుబడులతో పాటు, అనేక ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆరు రంగాల్లో సమూల మార్పుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం మంచి పరిణామమని, ఉద్యోగస్తులు మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆదాయ పన్ను 12 లక్షల వరకు పెంచడం హర్షించదగ్గ పరిణామం అని అన్నారు. రైల్వే రోడ్లు, విమానాశ్రయాల, విస్తరణకు ప్రాధాన్యత స్టాట్రప్ కంపెనీలకు రాయితీలు, భీమా రంగంలో ఎఫ్డిఐ అనేక కొత్త పథకాల ద్వార దేశం అభివృద్ధి పథంలో పయనించనుందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు రుణ సదుపాయాలను కల్పించే విధంగా ఉండడం శుభకరమన్నారు ఘనంగా బడ్జెట్లో పేదలు, యువత, రైతులు, మహిళలకు పెద్దపీట వేశారన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారుల కు కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు పన్ను సున్నా, వృద్ధులకు వడ్డీపై టీసీఎస్ ఊరట, 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు, రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి రూ.5 లక్షలకు పెంచడం 7.7 కోట్ల కొత్త కిసాన్ క్రెడిట్ కార్డులు అప్పు ఇవ్వడం దినుసుల కొనుగోలు జాతీయ పత్తి కమిషన్ ఏర్పాటు పనిలో కూరగాయలకు నూతన పథకం మంగళ పరిశోధనకు ప్రాధాన్యత లాంటి అనేక అంశాలు రైతులకు మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని తిప్పర్తి నికేష్ అన్నారు.





