- బిజెపి జిల్లా అధ్యక్షులు డి. నారాయణ
- రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మున్నూరు రవీందర్
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : ఉద్దెర గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ఆచరణలో పూర్తిగా వైఫల్యం చెందారు,చిన్నారెడ్డి గారు ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైన బీజేపీ నేడు 243 లోక్ సభ 97 రాజ్యసభ సభ్యులు 20 రాష్ట్రాలలో అధికారంలో..మీరు కేవలం 3 రాష్ట్రాలకే పరిమితం,721 కోట్ల నిధులలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉందని గుర్తుంచుకోండి, శిలాఫలకాలు కాదు ఎంత సమయంలో పూర్తి చేస్తారో సభ ముఖంగా నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి స్పష్టంచేయాలి. అసంపూర్తి రోడ్ల విస్తరణ,నష్టపోయిన భాదితులకు పరిహారం, డబుల్ బెడ్ రూమ్ కాలనీల్లో కనీస సదుపాయాలు కల్పించండి, మంచినీటి ఎద్దడిపై దృష్టి పెట్టండి.శనివారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి జిల్లా మీడియా ఇంచార్జీ పెద్దిరాజు ఆద్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. పాత్రికేయ సమావేశానికి ముఖ్యఅతిథి గా విచ్చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు డి.నారాయణ మాట్లాడుతూ అధికారం కొరకై అడ్డగోలు హామీలిచ్చి రాష్ట్ర ఖజానాను దివాలా తీయించారని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ సహకారం లేకపోతే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదని తీవ్రంగా విమర్శించారు.తెలంగాణలో బిజెపి కలలో కూడా అధికారంలోకి రాదని ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి బీజేపీ పార్టీ పైన చేసిన విమర్శలకు అర్థం లేదని రెండు సీట్లతో ప్రారంభమైన బీజేపీ నేడు 20 రాష్ట్రాలలో అధికారంలో ఉందని గత పార్లమెంటు ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా 8 మంది పార్లమెంటు సభ్యులు గెలిచారని ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో కూడా బిజెపి గెలిచిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన మెజారిటీని బిజెపి పార్టీ తుడిచిపెట్టి 63 వేలకు పైగా ఓట్లు సాధించిందని తాజాగా జరిగిన శాసనమండలి ఎన్నికలలో 3 సిట్లు బిజెపి గెలుస్తుందని బిజెపి ఎక్కడుందని ప్రశ్నించిన చిన్నారెడ్డికి భవిష్యత్తులో బిజెపి ఎక్కడుందో తెలుస్తుందని తెలియజేశారు. ఆదివారం వనపర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసే 721 కోట్లలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని శిలాఫలకాలు ప్రారంభోత్సవాలు చేయడం ముఖ్యం కాదని శిలాఫలకాలు ప్రారంభోత్సవాలు చేసిన 721 కోట్ల పనులు ఎంత సమయంలో పూర్తి చేస్తారో రేపు బహిరంగ సభ ముఖంగా వనపర్తి నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలని ప్రారంభోత్సవం చేసిన పనులు పూర్తి చేసే వినియోగంలోకి తీసుకువచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిజెపి వెంటాడుతుందని హెచ్చరించారు. బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మున్నూరు రవీందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన భారీ నిధుల పేరిట కాంగ్రెస్ చేస్తున్న హంగామా ప్రజలు గమనిస్తున్నారని వనపర్తి నియోజక వర్గంలో ముఖ్యంగా వనపర్తి జిల్లా కేంద్రంలో అసంపూర్తిగా మిగిలి పోయిన రోడ్ల విస్తరణను పూర్తి చేసి డివైడర్లను నియమించాలని నిర్మించాలని రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోయిన బాధితులకు డబల్ బెడ్ రూమ్ పేరిట పేట ఇచ్చిన ఇళ్లల్లో కాలనీలకు కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని రోడ్ల విస్తరణలో కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం ఇంకా పూర్తిగా అందజేయలేదని వనపర్తి పట్టణంలో ఎండాకాలం ప్రారంభానికి ముందే నీటి ఎద్దడి నెలకొందని వీటన్నిటి మీద వీటి పైన కూడా అధికార పార్టీ నాయకులు దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లేనిపక్షంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని హెచ్చరించారు.ఈ సమావేశంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బండారు కుమారస్వామి, ఆర్ వెంకటేశ్వర్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి జిల్లా మీడియా ఇన్చార్జి పెద్దిరాజు,పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




