- రాష్ట్రానికి నిధులు తీసుకు రావడంలో బీజేపీ ఎంపీలు విఫలమయ్యారు
- ఎన్నికలు వున్న రాష్ట్రాలకే అధిక బడ్జెట్
- రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్


నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ): ప్రజా ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించక పోవడానికి నిరసిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ… బిజెపి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రాలకు అధిక బడ్జెట్ కేటాయిస్తుందని,బీహార్, ఢిల్లీలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రాలకే కేంద్ర బడ్జెట్ లో పెద్ద పీట వేస్తోందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రనికి మొండి చేయి చూపెడుతుందని అన్నారు. రాష్ట్రంలోని 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారని, బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం చేసిన దానికి సిగ్గుపడాలని,8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు చేతకానితనం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు కేంద్ర మంత్రులు ఒక్కసారన్న కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మా తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని అడిగిన పాపనపోలేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు బేషాజాలకు పోకుండా ఒక సభలో నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్రనికి పెద్దన్న పాత్ర పోషించాలని కోరారని, ఆయన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి న్యాయం చేయడం లేదని అన్నారు. బయ్యారం ఉక్కు కర్మగారాన్ని పట్టించుకోకుండా పక్క రాష్ట్రంలో విశాఖ స్టీల్ గురించి మాట్లాడతారు,పాలమూరు రంగారెడ్డికి నిధులు ఇవ్వమంటే వాళ్లు పోలవరం గురించి మాట్లాడుతారని అన్నారు.మహానగరలు అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి చెందుతుంది,హైదరాబాద్ విశ్వ నగరంగా ముందుకు పోతుందని,కనీసం ఒక్క రూపాయి కూడా హైదరాబాద్ అభివృద్ధి కేటాయించలేదని అన్నారు. మహిళా మంత్రిగా నిర్మల సీతారామన్ మహిళ లోకాన్ని విస్మరించిందని,పేదలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా బిజెపి ప్రభుత్వం అమలు చేయడం లేదని మన రాష్ట్రం నుండి లక్షల కోట్లు పన్నుల రూపంలో తరలించకపోతున్న రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదని అన్నారు. బిజెపి ఎంపీ కేంద్రమంత్రుల వైఫల్యానికి నిదర్శనమే రాష్ట్రానికి నిధులు కేటాయించలేకపోవడం అని తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో అన్ని వర్గాల వారికి తమ ప్రాధాన్యత కల్పిస్తామని గత బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా ప్రజా ప్రభుత్వం ఆడంబరాలకు పోవడం లేదని వాస్తవానికి దగ్గరగా ప్రజా ప్రభుత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని అన్నారు. కేంద్రాన్ని సహకరించాలని ఎన్నిసార్లు కోరిన పట్టించుకోవడం లేదని బిజెపి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో పతనం తప్పదని అన్నారు.





