Friday, April 3, 2026

చెవేళ్ళ డిక్లరేషన్ ను అమలు చేయాలి

  • అంబేద్కర్ ఆభయ హస్తం పధకాన్ని ప్రవేశపెట్టాలి
  • డిబిఎఫ్ హనుమకొండ జిల్లా కార్యదర్శి చుంచు నరేష్

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్పీ, ఎస్టీ లకు ఇచ్చిన ఎన్నికల హామీలను అధికారంలోకి రాగానే విస్మరించిందని డి బి ఎఫ్ హన్మకొండ జిల్లా కార్యదర్శి నరేష్ అన్నారు. ముఖ్యంగా టి అర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పధకం స్థానంలో అంబేద్కర్ ఆభయహస్తం పేరుతో ప్రతి కుటుంబానికి 12 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందజెస్తామనె హామి నేటికి కార్యరూపం దాల్చలేదని అన్నారు. బడ్జెట్‌లో మొక్కుబడిగా నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నది. ఎస్సీ ల రిజర్వేషన్ లను 18 శాతం పెంచుతామనే హామిని సైతం విస్మరించిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ను మాల, మాదిగ ఉప కులాల కార్పొరేషన్ లుగా విభజిస్తామనే హామీని పట్టించుకొవడం లేదని పేదలకు భూ పంపిణి అటకెక్కించారని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News