Monday, March 16, 2026

రైతులను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం

  • బిఆర్ఎస్ పార్టీ చందుర్తి మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్లయ్య
  • బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం

నేటి సాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలిచ్చి తెలంగాణ ప్రజలను, రైతులను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిపించమని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో గాంధీ మహాత్ముడి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేకల ఎల్లయ్య మాట్లాడుతూ అలవికాని హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం 420 రోజులు పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని నమ్మ బలికిన కాంగ్రెస్ పార్టీ కేవలం అర్ధ గ్యారంటీని మాత్రమే పూర్తి చేసి డైవర్షన్ పాలిటిక్స్ తో కాలం వెళ్ళదిస్తుందని దిగబట్టారు. నేటికీ రుణమాఫీ పూర్తి కాకపోవడంతో చాలామంది రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అలాగే రెండు పంటలకు రైతు బంధు రాకపోవడంతో చిన్న సన్నకారు రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎద్దేడిసిన ఏవ్సం రైతే ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకి ఇస్తానన్న నెల నెల 2500/- కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం. నిరుద్యోగులకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు శాంతాడంతా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను, నిజా నిజాలను గుర్తెరిగి డైవర్షన్ పాలిటిక్స్ కు స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని లేదంటే ప్రజాక్షేత్రంలో రేవంత్ సర్కారుకు భంగపాటు తప్పదని హెచ్చరించారు. అంతకుముందు బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి మహాత్ముని విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కేడిసిసి డైరెక్టర్ జలగం కిషన్ రావు, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, మాజీ సెస్ డైరెక్టర్ చంటి బాబురావు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు బైరగోని రమేష్, ఈర్లపల్లి రాజు, పెగ్గర్ల రమేష్ రావు, ఎండి ఇస్మాయిల్, బత్తుల కమలాకర్, మాదాసు ప్రసాద్, పులి మనోహర్, మార్తా గంగాధర్, నల్మాస్ రవీందర్ రెడ్డి, పోతరాజు నగేష్, ముద్ర కోల వెంకటేశం, కపిల శంకర్, ముద్దసాని వెంకటేష్, బత్తుల వంశి, గడ్డం సాయికుమార్, నర్సింగం, సిహెచ్ వేణుగోపాలస్వామి, బత్తుల మధు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News