Thursday, March 26, 2026

మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది

  • రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది
  • బ్యాంకులు కల్పిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని మహిళలు మరింత అభివృద్ధి చెందాలి

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో యూనియన్ బ్యాంక్ ఇండియా వారి మెగా ఎం ఎస్ ఎం ఈ ఔట్‌రీచ్ క్యాంపెయిన్ ను వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక ప్రగతి సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. ప్రపంచంలో తాము సాధించ లేనిదంటూ ఏదీ లేదని మహిళలు రుజువు చేస్తున్నారని, అన్నీ రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రయత్నం చేయాలన్నారు. మహిళలు అర్థికంగా రాణించి నప్పుడే ఆ కుటుంబాలు మరింత అభివృద్ధి చెందు తాయని తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా ఎం ఎస్ ఎం ఈ ఔట్రీచ్ ప్రచారం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రోత్సహించడం మరియు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు అందించడం లక్ష్యంగా పెట్టుకుందని ఈ సందర్భంగా యూనియన్ బ్యాంకు సంస్థను ఎంపీ అభినందించారు. ఇలా బ్యాంకులు కల్పిస్తున్న అవకాశాలు సద్విని యోగం చేసుకుని మహిళలు మరింత అభివృద్ధి చెందాలన్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలతో చిన్న చిన్న వ్యాపారాల కే పరిమితం కాకుండా పెద్ద వ్యాపారాలు చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సెంట్రల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ గుణనంద్ గామీ, జనరల్ మేనేజర్ రమేష్, రీజనల్ హెడ్ సత్యం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News