- బీసీ ఉద్యమ నేత వట్టే జానయ్య యాదవ్
నేటి సాక్షి, మునగాల : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వట్టి కాంపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జటంగి వెంకటేశ్వర్లు యాదవ్ మృతి బాధాకరమని బిసి ఉద్యమ నేత వట్టే జానయ్య యాదవ్ అన్నారు. మంగళవారం వట్టి కాంపాడు గ్రామంలో వెంకటేశ్వర్లు యాదవ్ మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. లాయర్ జటంగి వెంకటేశ్వర్లు మృతి సూర్యాపేట ప్రాంత ప్రజలకు తీరనిలోటు అని ఆయన అన్నారు. జటంగి వెంకటేశ్వర్లు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థించారు.




