నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
వనపర్తి జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ మాట్లాడుతూ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్, మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలు దేశం ఎన్నటికి మరిచిపోదు. నిజాయితీ మంచితనం సమర్థవంతంగా పని చేయడంలాంటివి మన్మోహన్ సింగ్ ను చూసి నేర్చుకోవాలి అన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనుడు మన్మోహన్ సింగ్ యూత్ కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నందిమల్ల చంద్రమౌళి కౌన్సిలర్ చంద్రకళ ఎల్ఐసి కృష్ణ మాట్లాడుతూ
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా, ప్రధానిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు ప్రధాని పి.వి సారథ్యంలో ఆర్థిక మంత్రిగా దేశానికి ఒక కొత్త దిశ వైపు నడిపించిన గొప్ప ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ప్రపంచీకరణతో భారత్ ను తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత ఆయనది. ప్రధానిగా పదేళ్ల పాటు ఆయన తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచాయి. దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత ఆయనది, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు, సహనశీలిగా వివాదరహితుడిగా నిత్యం చిరునవ్వుతో కనిపించేవాడు. డా. మన్మోహన్ సింగ్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిల్చిపోతారు. దేశం ఒక గొప్ప ఆర్థిక నిపుణుడిని కోల్పోయింది. వారి కుటుంబానికి నా ఆశ్రు నివాళి, పాల్గొన్న నాయకులు వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త మున్సిపల్ కౌన్సిలర్స్ ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీ సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్ మత్స్యకార దివ్యాంగుల ఎన్ ఎస్ యు ఐ వక్స్ బోర్డ్ సభ్యులు ఐ ఎన్ టి యు సి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

