Tuesday, March 17, 2026

మహిళల ఆర్థిక అభివృద్ధితోనే సమాజం అభివృద్ధి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
డిఆర్డిఓ కిషన్
మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం

నేటి సాక్షి, మందమర్రి:-
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిఆర్డిఓ కిషన్ లు తెలిపారు. మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో మండల సమైక్య ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాంటీన్ లో రుచికరమైన టిఫిన్, భోజనం లభిస్తుందని, జిల్లా కేంద్రంలో మొదలైన క్యాంటీన్ విజయవంతంగా నడుస్తుందని, క్యాంటీన్ నిర్వాహకులు మండల సమైఖ్య ఆద్వర్యంలో హైదరాబాద్ లో శిక్షణ తీసుకుని, ఈ క్యాంటీన్ ను ఏర్పాటు చేశారని, రుచికరమైన, శుభ్రమైన ఆహార తినుబండారులు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ సతీష్ కుమార్, మండల ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్, మండల సమైక్య సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News