Tuesday, March 31, 2026

జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు)

ఇంటర్మీడియట్ పదో తరగతి వార్షిక పరీక్షలలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం హనుమకొండ హంటర్ రోడ్డు లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల (ధర్మసాగర్) ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలా రాస్తున్నారు, నీట్, ఎంసెట్ లకు దరఖాస్తు చేశారా అని కలెక్టర్ జూనియర్ కళాశాల విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. 8, 9, 10 తరగతి క్లాసు రూములకు వెళ్లి విద్యార్థునులతో కలెక్టర్ మాట్లాడారు. వార్షిక పరీక్షల సన్నద్ధత గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్ అందులో ఉన్న వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంసెట్, నీట్ పరీక్షల పుస్తకాలను కళాశాల విద్యార్ధినులకు కలెక్టర్ అందజేశారు. వంట గది, స్టోర్ రూమ్ లను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థినులకు వండిన భోజనాన్ని, కూరలను పరిశీలించారు. విద్యార్ధినులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో అల్పాహారం, భోజనం, అందించే మెనూ చార్ట్ ను పరిశీలించారు. విద్యార్ధినులకు సంబంధించిన టాయిలెట్స్ ను పరిశీలించారు. పరీక్షలు రాస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థినులతో పాటు వార్షిక పరీక్షలు రాయబోతున్న విద్యార్ధినులతో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ వార్షిక పరీక్షలకు బాగా సన్నద్ధమై ఫలితాల్లో మంచి మార్కులు సాధించి రాష్ట్రంలో జిల్లా పేరును నిలపాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు కలెక్టర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రిన్సిపల్ శైలజ, ఉపాధ్యాయులు, అధ్యాపకులతో మాట్లాడి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. యథాస్థానానికి పాఠశాల, కళాశాలను తరలించేందుకు అక్కడ కావాల్సిన వసతి సదుపాయల గురించి ప్రతిపాదనలు సమర్పిస్తే వాటిని మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అనంతరం పదో తరగతి విద్యార్ధినులకు కలెక్టర్ పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, ఇతర పరీక్ష సామాగ్రి అందజేశారు. పదో తరగతి హాల్ టికెట్లను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్ధినులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News