Wednesday, March 25, 2026

ముస్లిం సోదరుల కలలు సాకారం కావాలి

  • రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేశారు
  • మాజీ మంత్రి, మాజీ ఎం.పి.

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి : రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదరులకు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి మరియు మాజీ ఎం.పి రావుల చంద్రశేఖరరెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో ఆచరించే ఉపవాస దీక్షలు దైవచింతనను, ఆధ్యాత్మికతను, క్రమశిక్షణను,పెంపొందిస్తాయి అని వారు అన్నారు. గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి దర్పణంగా ఉన్న తెలంగాణ వారసత్వాన్ని కొనసాగిస్తూ లౌకికవాదం, మతసామరస్య పరిరక్షణకు రంజాన్ మాసం ఆదర్శప్రాయంగా నిలిచిందని తెలిపారు. ముస్లిం, మైనారిటీల అభ్యున్నతికి పదేండ్ల కె.సి.ఆర్ పాలన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిందని గుర్తుచేశారు. రంజాన్ మాసంలో ఉపవాసాలు చేసే ముస్లింల కలలు సాకారం కావాలి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డి ఆకాంక్షించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News