Monday, March 30, 2026

మహిళా అభ్యున్నతి కోసం బాలవికాస చేస్తున్న కృషి అభినందనీయం

  • జమ్మికుంట న్యూ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం

నేటి సాక్షి, జమ్మికుంట : మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బలవికాస సంస్థలోని మహిళా మహారాణులచే న్యూ కాటన్ మార్కెట్లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం జమ్మికుంట పట్టణం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూజారి రేణుక శివ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ మహిళలందరూ అన్ని రంగాలలో ముందు ఉండాలి. మగవాళ్ళ కంటే మహిళలు ఏ రంగంలో కూడా తక్కువ లేరు. మహిళలేని రంగమే లేదు అని అన్నారు. జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాట్లాడుతూ ప్రభుత్వ మహిళాభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకొస్తుంది. వాటిని మహిళలు సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళ కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు. అందరి తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాలవికాస జమ్మికుంట సెంట్రల్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ ఎక్కడ స్త్రీలు పూజింప మరియు గౌరవింపబడతారు అక్కడ దేవతలు నివసిస్తారు అని అన్నారు. సమాజంలో ఆడ మగ తేడా లేకుండా మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్లను గౌరవించాలి. మగవారు ఎక్కువ కాదు ఆడవాళ్లు తక్కువ కాదు అన్ని రంగాలలో ఆడవాళ్లు ఎదగాలని అన్నారు… ఈ కార్యక్రమంలో బాల వికాస కోఆర్డినేటర్ సుమలత స్వాతి ఆసియా మరియు అమూల్య మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలందరూ వివిధ రకాల ఆటల పోటీలలో పాల్గొని కార్యక్రమాన్ని కోలాహలంగా జరుపుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News