- మల్క కొమురయ్య గెలుపుపై నేతల హర్షం
- స్వీట్లు పంచి నేతల సంబరాలు
- తిప్పర్తి నికేశ్ ఆధ్వర్యంలో ర్యాలీకి భారీగా తరలివెళ్లిన నేతలు
నేటి సాక్షి, గన్నేరువరం (బుర్ర అంజయ్య గౌడ్) : కరీంనగర్, నిజామాబాద్,ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపు పట్ల గన్నేరువరం మండల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం గుండ్లపల్లి స్టేజి వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా నికేశ్ మాట్లాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందన్నారు. ఎన్నికలు ఏవైనా ప్రజలు బీజేపీ కి పట్టం గట్టి ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అని పేర్కొన్నారు. తాజాగా వెలువడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమురయ్య గెలుపుతో ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని మరోసారి నిరూపీతమైందన్నారు. ఇదే ఒరవడి రాబోయే రోజుల్లో కొనసాగుతుందని నికేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీజేపీ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
◆ కరీంనగర్ తరలి వెళ్లిన నాయకులు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమురయ్య భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో కరీంనగర్ లో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో గన్నేరువరం మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ అధ్యర్యంలో నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుంటుక శంకర్, విలాసాగరం రామచంద్రం, రాజిరెడ్డి, అనిల్ రెడ్డి, పంబాల రాజశేఖర్, రామచంద్రం, సురేందర్, గాద వెంకన్న, గట్టు కిషన్, బుర్ర చంద్రశేఖర్, మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




