- సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్
నేటి సాక్షి, వేమనపల్లి ; సీపీఐ వందేళ్ల చరిత్ర అంతా పేదలు అణగారిన వర్గాల పక్షాన పోరాటాలేననీ ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం సీపీఐ శతాబ్ది దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు దేవర బోయిన చిన్న శంకర్ పార్టీ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఓట్లు,సీట్ల కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేది సీపీఐ మాత్రమేనన్నారు.భారత స్వాతంత్రో ద్యమంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం,వేలాది ఎకరాల భూమి పేదలకు భూమి పంచడంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందని అన్నారు. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. నిరుపేదలకు ఇళ్లు, రేషనకార్డులు, పింఛన్లు దక్కే వరకు పేదల పక్షాన నిలబడి వీరోచిత పోరాటాలు నిర్వహించిన ఘన చరిత్ర సీపీఐ అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి అందే పురుషోత్తం, నాగయ్య, అందే మహేష్, హనుమంతు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.





