- నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ మోడల్ ఇల్లును పరిశీలన
- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి


నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఈ.వి.యం గోదాము నెలవారీ తనిఖీలో భాగంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు తో కలిసి పరిశీలించారు. జిల్లా కేంద్రలోని ఈవీఎంల గోదాము పోలీసుల పర్యవేక్షణలో నిరంతర నిఘా లో ఉందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గోదాం దగ్గర నిత్యం విధులు నిర్వహిస్తున్న పోలీసుల వివరాలు అడిగి రిజిస్టరు ను పరిశీలించారు. గోదాము వద్ద సీసీ కెమెరాలతో పర్యవేక్షణ గురించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ మోడల్ ఇల్లును పరిశీలించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక మోడల్ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయాలని సూచించిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ మోడల్ హౌస్ ను కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు? అని ప్రశ్నించగా.. హౌసింగ్ డిఈ బదులిస్తూ 23*20 విస్తీర్ణంలో, రూ. 5 లక్షల వ్యయంతో, సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కాగా మోడల్ హౌస్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాల విషయంపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జడ్పీ డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్, హౌసింగ్ డిఇ విటోబా, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.





