- గ్రామాల అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ, అభివృద్ధి పై లేదు

నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే ఈజీఎస్ నిధులతో గ్రామాల్లో అనేక పనులు జరుగుతున్నాయని, ముఖ్యంగా గ్రామ రహదారులు మొదలుకొని నేషనల్ హైవేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ఈజీఎస్ 30 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం రోజున బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ, అభివృద్ధి పై లేదన్నారు.గ్రామాల్లో సమస్యలురాజ్యమేలుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు. పాలకవర్గాలు లేక గ్రామపంచాయతీలను పట్టించుకునే నాధుడు లేక గ్రామాలు అనాధగా మారాయన్నారు.స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దమ్ము ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. పనికిమాలిన వ్యాఖ్యలు, రాజకీయాలు చేయడానికి, కాంగ్రెస్ నేతలు,మంత్రులు పనికి వస్తారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అనంతరం కాంగ్రెస్ నేతలు, మంత్రులు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు,మంత్రులు కేంద్రమంత్రి బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు, పట్టభద్రులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్ర కాల్చి వాతపెట్టిన కూడా ఇంకా బుద్ధి రాలేదన్నారు.ప్రజలను ఆరు గ్యారంటీలు, 420 హామీలతో, అబద్దాలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను ప్రస్తుతం ప్రజలంతా చీ కొడుతున్నారన్నారు. పట్టభద్రులు,టీచర్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారనే విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలని అదే విదంగా కాలేశ్వరం పై విచారణ, ఫోన్ టాపింగ్, విద్యుత్ కుంభకోణం, డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ రేస్ కేసు విషయాలను అటకెక్కించి బిఆర్ఎస్ తో లోపాయి కారి ఒప్పందాల తో ముందుకు కొనసాగుతుంది ఎవరో ప్రజలందరికీ అర్థమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బిజెపిని ఎదుర్కోవడానికి బిఆర్ ఎస్, కాంగ్రెస్ లు ఒక్కటై చేసిన కుట్రలన్నీ సమాజం గ్రహించిందన్నారు. ఈ మండల పర్యటనలో భాగంగా కమలాపురం గ్రామం లోని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కనుకుంట్ల అరవింద్ తండ్రి ఇటీవల మరణించినందున ఇంటికెళ్ళి పరామర్శించిన తరువాత శనిగరం గ్రామ మాజీ సర్పంచ్ సతీమణి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.వారి వెంట మండల అద్యక్షులు ర్యాకం శ్రీనివాస్ తు మ్మ శోభన్, కట్కూరి అశోక్ రెడ్డి, చెలిక శ్రీనివాస్, చిట్టి సుందరయ్య, మేడిపల్లి రాజు,పిట్టల సతీష్, దండవేని శ్రీనివాస్,భోగి భిక్షపతి,బండి కోటేశ్వర రాజ్, మహమ్మద్ బుర కుమార్, రావుల ఆకాష్, కడారి గణేష్, నాసని రాజు,పుష్కురి రాంబాబు,పెండ్యాల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



