- గులాబీ జెండా కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
- బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ శ్రేణులు నూతన ఉత్సాహంతో పని చేయాలి
- ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ అండగా ఉంటుంది
- పోరాటాలు బి ఆర్ ఎస్ కు కొత్తేమీ కాదు తప్పుడు కేసులకు భయపడేది లేదు
- తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకే భవిష్యత్తు
- కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : మాయ మాటలతో ప్రజలను మోసం చేసి అమలకు నోచుకోని హామీలను ఇచ్చిన అసమర్ధ చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ఎండగట్టాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.బుధవారం గుడిబండ గ్రామంలో మాజీ ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి నివాసంలో కోదాడ బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గులాబీ జెండా కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న పార్టీ తమదేనని మరల అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రతి గడప,గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ప్రజల కోసం నిరంతరం పని చేశామని ఏడాది కాంగ్రెస్ పాలనలో ఏం కోల్పోయమో ప్రజలందరికీ తెలిసి వచ్చిందన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలు కెసిఆర్ చేసి చూపించారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండా ఎగర వేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు మరల తాము అధికారంలోకి రాలేమని పై నుంచి కింది స్థాయి వరకు ఎవరికి తోచినంత వారు దోచుకుంటున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి సాగిస్తున్న పాలనను గడపగడపకు తీసుకువెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టాలన్నారు. పోరాటాలు బి ఆర్ ఎస్ కు కొత్తేమీ కాదని పోలీస్ కేసులకు భయపడేది లేదన్నారు. మరలా పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి,బిఆర్ఎస్ పార్టీ కోదాడ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు, మండలం కో ఆప్షన్ సభ్యులు షేక్ ఉద్దండు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ రమేష్, మాజీ సర్పంచ్ దొంగరి లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీ గంటా శ్రీను,దొంతగాని అప్పారావు,నారాయణ రావు, అన్నెం వెంకట్ రెడ్డి, కోటి రెడ్డి,బోసుబాబు, వరధారావు మాజీ సర్పంచులు గ్రామాశాఖ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





