నేటి సాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్: రాయచోటి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం ఏడాదికి ఒకసారి జరిగే గంగమ్మ తల్లి జాతరకు, లక్షలాదిమంది భక్తులు తరలి రావడంతో అశేష భక్త జన సందోహంతో జాతర ప్రాంగణం కిక్కిరిసింది. శనివారం ప్రారంభమైన జాతర కు దారులన్నీ జాతర వైపే కదిలాయి. దీంతో ఒక్కసారిగా జాతరో .. జాతర అన్నట్టుగానే అనిపించింది. ప్రత్యేక అలంకరణలో శ్రీ శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతూ దర్శనమిచ్చిన అనంతపురం గంగమ్మను భక్తులు కరుణించి కాపాడు అమ్మ అంటూ కదిలారు. ఊరూరా బోణాలుతో మొక్కులు చెల్లింపు. కస్తూరి రాజు గారి పల్లె గ్రామం చాగల గుట్టపల్లె అమ్మవారు నీ అర్ధరాత్రి సమయంలో ఆరుబయట ఉంచారు. సాంప్రదాయ బద్ధంగా పళ్ళు కృష్ణారెడ్డి, రఘునాథరెడ్డి కుటుంబ సభ్యులు మొదటి బోనంగా అమ్మవారికి జంతుబలులను సమర్పించారు. జాగారంకు తరలిన భక్తులు అమ్మవారికి కొబ్బరికాయలు కొడుతూ బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించారు. పళ్ళు రఘునాథరెడ్డి మేనల్లుడు వాసు బోర్వెల్స్ నాని జాగారంలో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేయడంతో జాగారంకు వచ్చిన భక్తులు సందడి చేశాలా ఉత్సాహంగా చిందులు వేశారు. భక్తులకు అదే గ్రామానికి చెందిన దాతలు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.




