- 3 ఎకరాల సొప్ప మరియు గడ్డి పంటకు నిప్పు అంటుకొని పూర్తిగా దగ్ధమైపోయింది
- కోళ్లపడకల్ గ్రామంలో అగ్ని ప్రమాదం – రైతుకు భారీ నష్టం
- ఈ ప్రమాదంతో కిష్టయ్య సంవత్సరంతా చేసిన శ్రమ వృధా అయిపోయింది.
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామానికి చెందిన చిన్న రైతు చేపంగి కిష్టయ్య తన పొలంలో సాగుచేసిన 3 ఎకరాల సోప్ప మరియు గడ్డి పంట నిప్పు ద్వారా అంటుకొని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన సోమవారం (17-03-2025) మధ్యాహ్నం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎండ వేడిమి లేదా పొలం సమీపంలో అగ్నిని ఉపయోగించడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంతో పొలం యజమానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.గంటలపాటు అగ్నిమాపక చర్యలు కొనసాగాయి. స్థానిక రైతులు,గ్రామస్తులు కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. చేపంగి కిష్టయ్య ఏడాది పాటు కష్టపడి సాగుచేసిన 3 ఎకరాల సోప్ప మరియు గడ్డి పంట ఒక్కసారిగా నిప్పు కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంతో ఆయన సంవత్సరంతా చేసిన శ్రమ వృధా అయిపోయింది. పంట నష్టంతో పాటు ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రమాదంపై సంబంధిత వ్యవసాయ అధికారులు స్పందించి, పొలం పరిస్థితిని పరిశీలించి, తగిన పరిహారం అందించాలి అని కిష్టయ్య కోరుతున్నారు. రైతుల కష్టానికి ప్రభుత్వం అండగా ఉండాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.





