- థియేటర్లో ప్రేక్షకులలో కేక పుట్టించిన హీరోయిన్లు
నేటి సాక్షి, (బాదూరు బాల) తిరుపతి : ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా.. ఎన్నో భారీ చిత్రాలు విడుదలైనాయి. వీరిలో మహిళలకు నచ్చే కుటుంబాలు మెచ్చే చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆదివారం చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని అనంతరం స్థానిక జై శ్యామ్ థియేటర్ నందు ప్రదర్శించబడుతున్న సంక్రాంతి వచ్చింది. చిత్రాన్ని తిలకించడానికి అలాగే ప్రేక్షకుల మధ్య గడపడానికి ఆ చిత్ర యూనిట్ వచ్చింది. ఈ సినిమాలో సన్నివేశాలను, డైలాగులను హీరోయిన్లతో కలిసి సెటైర్లు వేస్తూ అభిమానులు ఆనందిస్తూ కేరింతలు కొట్టారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా, అనిల్ రావి పూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజయవంతం అయిందని ఈ చిత్ర రథసారథులు కొనియాడారు. థియేటర్ నిర్వాహకులు ఎన్ వి. ప్రసాద్, ఆర్ సి మునికృష్ణ మరియు సిబ్బంది , పోలీసులు ఈ గ్రాటి ట్యూడ్ విజిట్ ను థియేటర్లో ఎటువంటి తొక్కి సలాట లేకుండా విజయవంతం చేశారు.